aksharalipi yodha episode 14

యోధ ఎపిసోడ్ 14

యోధ ఎపిసోడ్ 14 రూం బయట నుండి "పార్ధు... పార్ధు..." అంటూ ఎవరో పిలుస్తున్నట్టు పార్ధుకి వినిపిస్తున్నా, అతనిలో మాత్రం చలనం లేదు. జారుగా గడియ పెట్టి ఉన్న, ఆ రూం డోర్ ని కాస్తా... కొంచెం గట్టిగా తోయడంతో చివరికి అది తెరుచుకుంది. అలా ఆ వ్యక్తి పార్ధు దగ్గరికి వచ్చి, తనని తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. "హెల్ప్... హెల్ప్ ...! ప్లీజ్ కాపాడండి.. ప్లీజ్ నన్ను కాపాడండి..! " అంటూ పార్ధు ఒకటే మూలుగుతున్నాడు. చిర్రేత్తిన ఆ వ్యక్తి, ముసుగులో ఉన్న పార్ధుని ఒక్క తన్ను తన్నడంతో బొక్క బోర్లా కిందపడ్డాడు. "అమ్మా..!" అంటూ గట్టిగా అరుస్తూ ఆ మంచం మీద నుండి కిందపడ్డ పార్ధు, చుట్టూ చూస్తున్నాడు... పక్కనే వాళ్ల నాన్న, పార్ధుని అలా తన్నింది కూడా ఆయనే! "గాడిద... సన్నాసి... పనికిమాలిన వెధవ ... నీకెన్ని సార్లు చెప్పాలి రా..! పడుకునే ముందు ఆ దెయ్యం కథలు, క్రైమ్ వార్తలు చదవొధ్దని..!, నైట్ అంతా అవి చదవడం, నిద్రలో కలలు…
Read More