aksharalipi yodha episode 2

యోధ ఎపిసోడ్ 2

యోధ ఎపిసోడ్ 2 అలా ఛాలెంజ్ చేసిన మరసటి రోజు నుండే కాలేజ్ అంతా ఒక రెండు వారాలు ప్రాజెక్ట్ హాలిడేస్ ఇవ్వడంతో.... విక్కి, పార్ధుని వీలైనంత త్వరగా ఈ ఛాలెంజ్ నీ ఫినిష్ చేయవలసిందిగా తొందరపెడతాడు. విక్కి గురించి కాకపోయినా... దీన్ని ఎంత తొందరగా వీలైతే, అంత తొందరగా కంప్లీట్ చేద్దామనే ఆలోచన పార్ధుకి ఉంది. దీని గురించి పార్ధు తన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి, విక్కితో ఛాలెంజ్ చేసిన ఆ మరుసటి రోజు సాయంత్రమే అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు. "అంతా బాగానే ఉంది కానీ, ఈ వారం రోజులు ఎక్కడికి వెళ్తున్నారని ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి?" అంటూ తనకున్న సందేహాన్ని బయటపెడుతుంది, పార్ధు స్నేహితులలో ఒకరైనా ప్రియ. విశాల్, గౌతమి కూడా "అవును కదా..!" అన్నట్టు తలాడిస్తూ పార్ధు వంక చూస్తారు. "ఏముంది... ప్రాజెక్ట్ వర్క్ మీద ఒక వన్ వీక్ బయటకి వెళ్తున్నామని చెప్తే…
Read More