aksharalipi yodha episode 5

యోధ ఎపిసోడ్ 5

యోధ ఎపిసోడ్ 5 తెల్లారి మంగళవారం. పొద్దుకూగింది, అప్పటికే దాదాపు ఎనిమిది గంటలు అవుతుంది. అప్పుడే నిద్ర లేచిన ప్రియ... మూసిన కళ్ళు తెరవకుండానే, అదే బెడ్ పై నుండి "లక్ష్మి కాఫీ... లక్ష్మి కాఫీ..." అంటూ పెద్దగా అరుస్తుంది. ఆ అరుపులకి లక్ష్మి నుంచి ఏ స్పందనా రాలేదు. కానీ, ఆ అరుపులకి ఉలిక్కి పడి లేచిన పార్ధు, విశాల్ వాళ్ల వాళ్ళ గదుల నుండి తలుపులు తీసుకుంటూ బయటకి వచ్చి చూసారు. ఇంకా ప్రియ "లక్ష్మి కాఫీ... లక్ష్మి కాఫీ..." అంటూ అలా అరుస్తూనే ఉంది. ఆ శబ్ధం వస్తున్న గది వైపు చూసిన వాళ్ళిద్దరూ (పార్ధు, విశాల్) ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆ శబ్ధం వస్తుంది అవేశ్ కి కేటాయించిన గది నుండి.. వాయిస్ మాత్రం ప్రియ ది. తను అంతగా అరుస్తున్నా, లక్ష్మి నుండి అసలు ఉలుకు పలుకు లేదు. పైన ఆ కారిడార్ నుండి కిందనున్న వీరయ్య- లక్ష్మి ల గది…
Read More