బండబారిన గుండె
బండబారిన గుండె బండ బారిన గుండె నిప్పులు చెరిగే చూపు కొండను పిండే దేహం గర్జించే కంఠం.... ఇంటికి కంచైతాను కంటికి కునుకైతాను గుండెకు భారోసానైతాను ఎదిరించే కోడె గిత్తైతాను... నేలను దున్నే నాగలై మొలకెత్తే గింజకు మట్టినై నెచ్చలి ప్రేమకు అంకితమై వ్యసనాలకు బానిసలై.... నావను నడిపే తెడ్డునై యంత్రాన్ని నడిపే ఇందనమై ఆలికి వెచ్చని కావుగిలినై బిడ్డలకు నెత్తిన గొడుగునై... కానరాని భాదను మనసునదాచి చిరునవ్వులు చిందే బొమ్మనై బ్రమ్మరాసే రాతలకు బలై కఠినమైన మాటల వెనక ఖరీదైన వెన్నముద్ద లైన మహానుభావులందరికి అంతర్జాతీయ పురుషుల దినత్సవ శుభాకాంక్షలు - హనుమంత