అబ్బాయిల జీవితం
అబ్బాయిల జీవితం పితృస్వామ్య వ్యవస్థ ద్వారా మగవాళ్ళు ఆడవాళ్ళని అనాది కాలం నుండి అన్ని విధాలా అధఃపాతాలానికి అణగద్రొక్కుతూనే ఉన్నారు ఈరోజుకి కూడా. చదువు ప్రసాదించిన తెగువతో ప్రపంచాన్ని అర్థంచేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు మహిళామణులు. ఇది ఇలా సాగుతున్న తరుణంలో కొంతమంది స్త్రీలు స్త్రీ వాదాన్ని తమ స్వంత ప్రయోజనాల కోసం చెడు మార్గంలో ఉపయోగించుకుని ఆడజాతి అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్న ఎందరో మహనీయుల పోరాటాలకు అర్థం లేకుండా చేస్తున్నారు. మరి ఇది మగవారి దురదృష్టమో లేక ఆడజాతికి పితృస్వామ్య వ్యవస్థ ద్వారా వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన ప్రతిఫలమో తెలీదు కానీ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతూ ఉండడం మాత్రం బాధాకరం. పూర్వపు రోజుల్లో ఎత్తిన తల దించకుండా, అమ్మ, నాన్న మాట జవదాటకుండా పెంపకాలు ఉండేవి. నిజానికి లోకం తెలీకుండా సమాజమనే భయం చూపించి పెంచేవారు. టెక్నాలజీ వృద్ధికి నోచుకోకపోవడం ఒక…