andamaina shatruvu by gayathrie bhaskar

అందమైన శత్రువు

అందమైన శత్రువు ఏమి తెలియని నా జీవితం లో అందమైన శత్రువు .. నువ్వే..! ఎన్ని తిప్పలు పెట్టినా.. ఎంత విసిగించినా.. ఎంత కోప్పడ్డా.. నీ కళ్ళల్లో కనిపించే నా మీద ప్రేమ అన్నీ.. మరచిపోయేలా చేస్తుంది.. నా జీవితానికి ఆధారం నువ్వు కాదు.. మనపై మనమీద మనకుండే అంతులేని ప్రేమ.. అన్నీ గెలిచేలా.. చేస్తుంది.. అందుకే.. నువ్వంటే అంత ప్రేమ.. ఎంత ప్రేమొచ్చిన.. అలక అలిగితే తీర్చవు.. బుజ్జగించవు సరికదా.. ఏమిటి ఇంకా నువ్వు చిన్నపిల్లవా..అని ప్రశ్నించి ప్రేమను దాచేస్తావ్.. అందుకే నువ్వు నా అందమైన శత్రువు.. ముద్దుగా తిట్టినా.. మొరటుగా మొట్టికాయలు వేసినా.. నీమీద.. ఎంతో ప్రేమను కురిపిస్తూ.. కరిగి కన్నీరైపోతాను.. చివరికి.. నాలో నేనే తలుచుకుంటూ నవ్వుకుంటాను.. అందుకే నువ్వంటే గౌరవం.. నువ్వంటే అమితమైన ఇష్టం.. చచ్చేంత ప్రాణం! - గాయత్రీభాస్కర్ 
Read More