anna aksharalipi. aksharalipi anna

అన్న

అన్న నా పేరు హరిత. నేను Z.P.H.S లో ఏడవ తరగతి చదువుతున్నా. నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్తాను. వెళ్ళే దారిలో ఒక చిన్న గుడిసె, అక్కడ ప్రతిరోజూ గొడవ జరుగుతూనే వుండేది ఎందుకిలా గొడవ పడతారు అని నా స్నేహితులను అడిగా “వాళ్ళింట్లో మొత్తం ముగ్గురున్నారు ఆ అన్న పేరు హరీష్. అతను ఇంటర్మీడియేట్ పాస్ అయ్యాడు. వాళ్ల అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది అప్పటి నుండి మద్యం, ధూమపానం, అమ్మానాన్నల దగ్గర ఉన్న డబ్బును లాక్కొని వృథాచేయడం వంటివి చేస్తున్నాడు” అని చెప్పారు. సరేలే అని బడికి వెళ్ళాము. డిసెంబర్ నెల కాబట్టి నూతన సంవత్సరం వస్తుంది కదా! అందరూ ఏం చేయాలని అనుకుంటున్నారు అని టీచర్ అడిగింది. కొంతమంది కొత్తబట్టలు, కొంతమంది ఊరికి, గుడికి వెళ్ళాలి అని చెప్పారు. నేను కూడా ఎదో…
Read More