anveshana episode 6

అన్వేషణ ఎపిసోడ్ 6

అన్వేషణ ఎపిసోడ్ 6 అసలే దుఃఖంలోనున్న నాకు, ఆ తర్వాతి రోజు వాళ్ళమ్మ గారు కనిపించారు. దగ్గరకు వెళ్ళి పలకరించబోతే, "ఛీ.. ఛీ.. నీ మొహం నాకు చూపించకు. నువ్వొక అనాధవని తెలిసి కూడా నా కూతురిని నీకిచ్చి కట్టబెడదామనుకుంటే, ఇంత దారుణానికి ఒడిగట్టి, తనని మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందయ్య...! ఇంకా ఏం కాకుండానే పరాయి వాళ్ళతో కులుకుతున్నవ్ అంటే, రేపు పెళ్ళైయ్యాక నేరుగా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా తీసుకొస్తావేమో?. అప్పుడు నా కూతురి బ్రతుకేం కావాలి. పెళ్లికి ముందే ఇలాంటి నీ గుట్టులన్నీ నా కూతురి కంట పడేట్టు చేసి, ఆ దేవుడు మాకు ఒకింత మేలే చేశాడులే. మేము డబ్బు లేనోల్లేమే కానీ, నీలా సంస్కారం లేనోల్లం కాదయ్యా..! అయినా ఏ దిక్కైనా ఉంటేనే కదా!, బంధం విలువ బంధుత్వం విలువ తెలిసేది. మా ఉసురు పోసుకుని ఇంతకింత అనుభవిస్తావ్ చూడూ..." అంటూ ఆవిడ కూడా నేను చెప్పేదేది వినకుండా…
Read More