anveshana episode 7 by bharadwaj

అన్వేషణ ఎపిసోడ్ 7

అన్వేషణ ఎపిసోడ్ 7 ఆ డైరీలో ఇంకేమి లేకపోవడంతో, నిరాశగా దాని మూసి పక్కన పెడుతున్న రంజిత్ కి... "ట్రింగ్.. ట్రింగ్..." అంటూ కాలింగ్ బెల్ శబ్ధం వినపడుతుంది. దుప్పటి ముసుగులో ఉన్న రంజిత్ ఒక్కసారిగా ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసాడు.. (అవును మీరు విన్నది నిజమే!. అతను అప్పుడే నిద్రలోంచి లేచాడు. అంటే, ఇప్పటివరకూ జరిగిందంతా అతను కన్న కలన్న మాట.) తను చదివిన ఆ డైరీ కోసం చుట్టూ చూసాడు. కానీ, అదెక్కడా కనిపించడం లేదు. తన కళ్ళు కూడా అప్పుడే నిద్రలోంచి తెరుచుకున్నట్టు మసకగానే ఉన్నాయి. అప్పుడర్థమైంది రంజిత్ కి, "అదంతా ఆ రోజు రాత్రి తను కన్నది ఓ కలని. (ఆ ముసలాడు రావడం, తను ఏవేవో చెప్పడం, ఆ డైరీ నాకివ్వడం, అందులో ఉన్న విషయం అంతా నా ఊహేనా అనుకుంటూ నిస్పృహలో మునిగిపోయాడు). ఆ కాలింగ్ బెల్ శబ్దానికి తను తేరుకుని ఆ…
Read More