చీకట్లు
చీకట్లు ఈ చీకట్లు ఎన్నో అంధకారంలో మగ్గిపోయిన జ్ఞాపకాలను నిద్రలేపుతున్నాయి. ఈ చీకట్లు ఎన్నో మూగబోయిన హృదయ స్వరాలను తమ గానం వినిపించమంటున్నాయి. ఈ చీకట్లు ఎన్నో మిగిలిపోయిన కలలను ఆకర్షణీయ వర్ణాలతో మళ్లీ కనమంటున్నాయి. ఈ చీకట్లు ఎన్నో నలిగిపోయిన కళలను వినూత్న రీతిలో పునరుద్ధరించమంటున్నాయి. ఈ చీకట్లు నా ఇక్కట్లను చీల్చుకుంటూ ముందుకు సాగమని నన్ను ప్రేరేపిస్తున్నాయి. - శంభుని సంధ్య