దైవం మనుష్య రూపేణా…!
దైవం మనుష్య రూపేణా...! అప్పుడు నాకు పదిహేనేళ్లు.. పదవతరగతి పూర్తి చేసేపనిలో ఉన్నాను. ఒకరోజు నేను నా స్నేహితుడు కలిసి దగ్గర్లోని టౌన్ కి సినిమాకు వెళ్లాలని అతికష్టం మీద ఇంట్లో ఒప్పించాం.. అందులో భాగంగా నా స్నేహితుడి అమ్మకు నేను ఒక మాటిచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ లారీ ఎక్కమని.. బస్సులోనే వెళతామని.. జాగ్రత్తగా వాడిని తీసుకువస్తానని.. అప్పుడుగానీ ఆ అమ్మ మనసు కుదుటపడలేదు. ఆ వయసులోనే నా వయసులో ఉన్న మరొకరికి నేను రక్షణనివ్వడం వెనుక నా ధైర్యం ఏమిటో...? నాకప్పుడు తెలీదు. చేతిలో కాసిన్ని డబ్బులతో పట్నానికి బయలుదేరాం.. పట్నానికి వెళ్లి ఓ సినిమా చూశాం. అప్పటికే బాగా ఆకలి వేస్తుండటంతో ఓ హోటల్ కి వెళ్లాం. రెండు ఇడ్లీలు తిని బిల్లు ఇస్తే ఒక రూపాయిని హోటల్ లో వెనక్కి ఇచ్చారు. నేను ఆ రూపాయిని సర్వర్ కి టిప్పుగా ఇచ్చేశాను. ఆ సమయంలో నాలో ఒక…