detective episode 2 by bharadwaj

డిటెక్టివ్ ఎపిసోడ్ 2

డిటెక్టివ్ ఎపిసోడ్ 2 బేవకూఫ్.. నీకళ్ళకు మేమెలా కనిపిస్తున్నాం? కోపంగా అన్నాడా వ్యక్తి "బేవకూఫ్స్ లానే కనిపిస్తున్నారా" అనాలనుకుని అంటే మళ్ళీ చెంప చెళ్లుమనిపిస్తారని డౌటొచ్చి ఆ ప్రయత్నమే విరమించుకుని "చెంప రుద్దుకుంటూ" పానీపూరి గురించి అతడడిగితే నన్నెందుకు కొడతారు? వెళ్లి ఆయన్ని కొట్టండీ..." ఉక్రోషంగా అన్నాడు. "నిన్ను కొట్టిందికి అందుక్కాదు" ఆ నలుగురు ఒకేసారి అన్నారు. "మరి టైం పాస్ కోసం కొట్టారా? కోపంగా అడిగాడు జేమ్స్ "నేను చెబుతాను భయ్యా" అని వినిపించింది. ఆ నలుగురితో పాటు జేమ్స్ కూడా ఆ మాటలు వినిపించిన వైపు చూసారు. ఒక్కసారిగా ఎవరో ఆ గోడౌన్ షట్టర్ పైకెత్తినట్టు బయట నుంచి వెలుతురు లోనికి వచ్చింది.. ఆ వెలుతురులో ఓ మనిషి నీడ కనిపిస్తుంది. తర్వాత షట్టర్ వేసిన చప్పుడు. "ఎవరూ.... కౌన్ హై ? ఆ నలుగురు అగంతకుల్లో ఒకడడిగాడు 'తెలుగులో చెప్పాలా? హిందీలో చెప్పాలా?" అంటూ ఆ వెలుతురులో…
Read More