detective episode 3

డిటెక్టివ్ ఎపిసోడ్ 3

డిటెక్టివ్ ఎపిసోడ్ 3 ప్యాంట్ జేబులో చేయిపెట్టుకుని నడుస్తున్నాడు సిద్దార్థ. హైద్రాబాద్ అతనికి కొత్తగా కనిపిస్తోంది. ఒక్క సంవత్సరంలోనే ఎంతో మారినట్టు అనిపిస్తోంది. మెట్రో రైలు పైనుంచి వెళ్తుంటే చూడ్డం బావుంది. స్కూల్ పిల్లలు యుద్ధానికి వెళ్తున్నట్టు వీపున పుస్తకాల బ్యాగు మోస్తూ వెళ్తున్నారు... ఇంకా సూర్యుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టలేదు. ఓ మూలమలుపు తిరిగాడు.. ఇంకా తాను ఎదురుచూస్తోన్న సంఘటన ఎదురవ్వలేదు. తన అంచనా ప్రకారం ఈపాటికి రియాక్షన్ ఆక్షన్ లోకి వచ్చి ఉండాలి. రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తాను క్యాబ్ డ్రైవర్ జేమ్స్ ను కాపాడి.... గోడౌన్ లో రౌడీలను చితక్కొట్టాక జేమ్స్ ను పంపించి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కొందరు అగాంతకులు తన మీద ఎటాక్ చేయడం గుర్తొచ్చింది. తను పరుగెడుతున్నాడు.. ఆ ఏరియా లో వున్న సిసి కెమెరాలకు తన పేస్ కనిపించేలా పరుగెడుతున్నాడు..... తనకు వాళ్లకు మధ్య ఛేజింగ్... వాళ్ళు కత్తులతో వెంబడించారు...…
Read More