డిటెక్టివ్ ఎపిసోడ్ 7
డిటెక్టివ్ ఎపిసోడ్ 7 నేలంతా దుమ్ము కొట్టుకుపోయి వుంది.. లోపలికి అడుగుపెట్టి అన్నాడు కాస్త భయపడుతూనే జేమ్స్ "మనకు జేమ్స్ సీక్రెట్ గా దాచిపెట్టిన సాక్ష్యం కావాలి. అది ఓ పెన్ డ్రైవ్ లో ఉన్నట్టు సమాచారం" అన్నాడు సిద్ధార్థ "ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో ఎలా కనిపెట్టడం? జేమ్స్ అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ జేమ్స్ వైపు చూసి చెప్పాడు చిరునవ్వుతో "చనిపోయిన మీ ఫ్రెండ్ డేవిడ్ ను అడుగు" జేమ్స్ ఉలిక్కి పడ్డాడు.. డేవిడ్ ను తను అడగడమే? సిద్ధార్థ జోక్ చేస్తున్నాడా? "అడుగు భయ్యా.. నువ్వడిగితే తప్పకండా చెబుతాడు... "నింపాదిగా అన్నాడు సిద్ధార్థ జేమ్స్ కళ్ళు మూసుకున్నాడు... అడుగుతున్నావా? అడుగు..." అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ మనసులోనే డేవిడ్ ను అడిగిన ఫీలింగ్ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి షాకయ్యాడు.. డేవిడ్ నడుస్తున్నాడు.. అతని అడుగుజాడలు దుమ్ము మీద ముద్రలుగా పడుతున్నాయి. ఒక్కక్షణం నమ్మశక్యం కానట్టు నేలవైపు చూసాడు. దుమ్ములో…