ఎవరు ఫైనల్ పార్ట్
ఎవరు ఫైనల్ పార్ట్ లక్ష్మిగారు బలంగా ఉపిరి పీల్చుకుని, చిన్నగా “నేనే” అని సమాధానం ఇచ్చారు. నాకు ఏమీ అర్ధం కాలేదు. అలీ వైపు చూసాను, అలీ నవ్వుతూ కనిపించాడు. “అంటే అది చేసింది దర్శన్ గారు కాదా?” అలీ “కత్తి కొన్నది వారే, కానీ వాడింది మేము.” “అర్థం కాలేదు” అలీ “అసలు ముక్తానంద భూపతి ఎలా చనిపోయారు? ఎక్కడా దొరకని ఆ వింత రసాయనం(డ్రగ్) దర్శన్ గారికి ఎక్కడిది? విగ్రహం భూపతి రాజు గారి దగ్గర ఉంది అని దర్శన్ చిత్రపాటికి ఎలా తెలుసు? ఇవన్ని కనుమూరి కేసు ఫైల్ లో ప్రశ్నలుగానే మిగిలిపోయిన అనుమానాలు.” ********* అలీ కొనసాగిస్తూ “ఎప్పుడైతే నేను కేసు సొంతగా సాల్వ్ చేయాలి అనుకున్నానో అప్పుడు ఈ ఊరికి బయలుదేరాను. కానీ నేను వచ్చిన రోజే భూపతి రాజుగారు మరణించారు. ఆ రోజు భూపతి రాజుగారు మృత దేహాన్ని చూడటానికి వచ్చిన అడివి…