ఎవరు పార్ట్ 10
ఎవరు పార్ట్ 10 “ఏంటి ఈ హడావిడి? ఎక్కడికి తీస్కుని వెళ్తున్నావ్?” నిద్ర బద్దకం వదలక పోవటం వల్ల వచ్చిన విసుగుతో అలీ ప్రశ్నలు సంధిస్తునాడు. “భాయ్, కాస్త మాట్లాడు.” హడావిడిగా వెళ్తున్న నేను వెనక్కి తిరిగి “కాసేపు ఓపిక పట్టచ్చు కదా, నీకే తెలుస్తుంది. అంత మెల్లగా నడిస్తే ఎలా!” “పోదు పొద్దునే పరుగులు నా వల్ల కాదు. మంచు కూడా ఇంకా పోలేదు.” నడుస్తున్న వాడు ఆగిపోయి, నడుము పట్టుకుని “ఎక్కడికో చెప్పు” “పోతన కోసం” “పోతన?” అలీ “అదే నా ముందు ఇక్కడ పని చేస్తుండే తాత.” “అది తెలుసు, ఇప్పుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళటం ఎందుకు?” అలీ “తన మీద నాకు అనుమానం ఉంది” “ఎప్పుడూ లేనిదీ ఇప్పుడు హఠాత్తుగా నీకు ఈ పరిశోధక బుద్ధి పుట్టింది ఏంటి?” అలీ “ఇప్పటి వరకు ఏది ఎలా జరిగినా అది నా వరకు రాలేదు. కానీ ఇప్పుడు…