హితకారులు
హితకారులు సాయం సంధ్యవేళ కావస్తుంటే ఇంటి పెరట్లో కూర్చుని ముసిముసిగా నవ్వుకుంటున్నాడు సెలవులకోసమని బామ్మగారు ఊరు వచ్చిన ఎనిమిదవ తరగతి చదివే ఉమేష్. అరే ఉమా ఏం చేస్తున్నావురా అంటూ వచ్చింది బామ్మ. ఏం లేదు బామ్మా సాయం సంధ్యలో ఆ పక్షుల కువకువలు వింటుంటే మనసుకేదో తెలియని ఆనందం కదా బామ్మా అంటాడు. అవునురా అబ్బీ! మన సంస్కృతీ సంప్రదాయాలలో పశుపక్ష్యాదులు కూడా భాగమే.. ఆ సంగతి తెలిపేందుకు మన ఇతిహాసాలలో కథలు కోకొల్లలుగా ఉన్నాయి. రామాయణంలో సీతమ్మవారిని కాపాడే ప్రయత్నం చేసిన దశరధుని స్నేహితుడైన జటాయువు. ఆ శ్రీహరికి వాహనంగా నిలిచిన గరుడుడు. రామ రామ అంటూ సీతమ్మచే మాటలు నేర్చిన వాల్మీకి కుటీరంలోని చిలుకలు.. ఇలా అనేక ఉదంతాలున్నాయి అంటూ వివరిస్తుంది. మనలో భాగంగా ఉభయ సంధ్యల్లోనూ వాటి కువకువలతో చక్కగా పలకరిస్తాయి కదా బామ్మా అంటాడు ఉమేష్. అవును రా ఉమా... పచ్చని ప్రకృతితో అలరారే…