holi

హోలీ

హోలీ ప్రతీ సంవత్సరం యావద్భారత దేశంలో "ఫాల్గుణ మాసం పూర్ణిమ" తిథినాడు అత్యంత ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ వసంతఋతువు ఆగమనాన్ని తెలుయజేస్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు "హొలిక" అనే రాక్షసిని చంపిన దినంగా ఈ "హోలీ" పండుగ చేసుకుంటారట. దీనినే ఇంకా కాముని పున్నమిగా, డోలికోత్సవముగా, ఫాల్గుణోత్సవముగా, వివిధ నామాలతో వ్యవహరిస్తూ ఉంటారు. "హోలీ" అంటే ముందుగా అందరికి రంగులే గుర్తుకు వస్తాయి.  ఈ హోలీ పండుగ గూర్చి విభిన్నమైన గాథలు కనిపిస్తున్నాయి. "శ్రీ బలరామ కృష్ణుని" ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రవచనం. అందువల్ల బెంగాలు రాష్ట్రమందు ఈ రోజు శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలోవేసి ఊపుచూ "డోలికోత్సవాన్ని" జరుపుకుంటారు. 'దక్షయజ్ఞ' సమయమందు అగ్నికి ఆత్మాహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు వారు పార్వతి అను నామధేయముచేస్తారు. ఇలా ఉండగా! సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర…
Read More

హొలీ ఎందుకు జరుపుకుంటారు?

హొలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ ప్రతి ఏటా ఫ్హాల్గుణ మాసం లో వస్తుంది. రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు.  నిత్యం విష్ణు నామస్మరణలో ఉన్న ప్రహ్లాదుడుపై కోపం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు తన సోదరి హోళికా పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు. ఆమెకి లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమి చెయ్యదు అన్న ఆజ్ఞ తో, బాలుడు అని చూడకుండా ప్రహ్లాదునితో కలిసి అగ్నిగుండం లోకి వెళుతుంది. అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకొనే ఆ పరమాత్మ మౌనంగా ఉండగలడా... ఆ చిద్వినస్మూర్తి వెంటనే ఆ బాలుడికి మంటలు తాకకుండా అనుగ్రహించారు. వెంటనే ప్రహ్లాదుడు మంటల నుండి సురక్షితంగా బయటికి వచ్చాడు. కానీ, హోళికా మంటలకు ఆహుతి అయి ప్రాణాలు విడిచింది. మీకు ఒక సందేహం రావచ్చు హోళికాకు వరం ఉందిగా అని కానీ ఒంటరిగా అగ్ని ప్రవేశ చేస్తే తనకు వరం లభిస్తుంది.…
Read More