horror storys

యోధ ఎపిసోడ్ 3

యోధ ఎపిసోడ్ 3 అలా ఢీ కొట్టిన వాళ్ల కార్ దగ్గరకు వచ్చి, ఎవరో ఆ కార్ డోర్ ని కొడుతూ అందులో వున్న వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తున్నారు. "సారు...! సారూ...!" అంటూ ఒక మగ వాయిస్ "అయ్యా...! అమ్మా..!" అంటూ మరొక ఆడ వాయిస్ తో పార్ధు మరియు అతని స్నేహితులకు బయట నుండి వాళ్ళని ఎవరో పిలుస్తున్నట్టు వాళ్ళకి ఒకటే శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ పిలుపులు దాటికి ఉల్లిక్కి పడి లేచి, డోర్ తీసిన వాళ్ళకి అసలు వాళ్ళు ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో? కూడా అర్థం కావడం లేదు. కానీ, చుట్టూ చూస్తుంటే అప్పటికే ఉదయం అయినట్టు వాళ్ళకి అర్థమైంది. కార్ పక్కనే ఒక మగ మనిషి, ఆడ మనిషి వాళ్ళకి దర్శనం ఇచ్చారు. కార్ లో నుండి కిందికి దిగిన వాళ్లకు, పక్కనే ఒక పెద్ద బంగ్లా కూడా దర్శనమిచ్చింది. ఆ బంగ్లా గోడకే వీళ్ళ కార్ డాష్ ఇచ్చినట్టు వాళ్ళు గమనించారు. అలా…
Read More

యోధ ఎపిసోడ్ 2

యోధ ఎపిసోడ్ 2 అలా ఛాలెంజ్ చేసిన మరసటి రోజు నుండే కాలేజ్ అంతా ఒక రెండు వారాలు ప్రాజెక్ట్ హాలిడేస్ ఇవ్వడంతో.... విక్కి, పార్ధుని వీలైనంత త్వరగా ఈ ఛాలెంజ్ నీ ఫినిష్ చేయవలసిందిగా తొందరపెడతాడు. విక్కి గురించి కాకపోయినా... దీన్ని ఎంత తొందరగా వీలైతే, అంత తొందరగా కంప్లీట్ చేద్దామనే ఆలోచన పార్ధుకి ఉంది. దీని గురించి పార్ధు తన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి, విక్కితో ఛాలెంజ్ చేసిన ఆ మరుసటి రోజు సాయంత్రమే అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు. "అంతా బాగానే ఉంది కానీ, ఈ వారం రోజులు ఎక్కడికి వెళ్తున్నారని ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి?" అంటూ తనకున్న సందేహాన్ని బయటపెడుతుంది, పార్ధు స్నేహితులలో ఒకరైనా ప్రియ. విశాల్, గౌతమి కూడా "అవును కదా..!" అన్నట్టు తలాడిస్తూ పార్ధు వంక చూస్తారు. "ఏముంది... ప్రాజెక్ట్ వర్క్ మీద ఒక వన్ వీక్ బయటకి వెళ్తున్నామని చెప్తే…
Read More

నిశబ్దం

నిశబ్దం ఈ తరానికి చెందిన ఒక ఆత్మకథ.... పగ తీర్చుకునే ప్రయత్నం కాదు ప్రాణాలు తీసే ప్రేతాత్మ... దానితో చెలగాటం అంటే కొలిమి తో ఆటలే మన పెద్దలు చెప్పే దానికి ఎప్పుడు ఒక అర్థం ఉంటుంది అది కాదని మనం అతిగా ప్రయత్నిస్తే జరిగేవి అనర్థాలే... అలాంటి ఒక ప్రమాదమే ఈ నా కథ. నా వర్ణనల ప్రకారం వర్ణిస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి... ఊరికి అవతల ఒక చిన్న ఇల్లు ఉండేది. దానిలో ఒక బామ్మ, ఒక అందమైన అమ్మాయి ఉండేవారు ఆ అమ్మాయి పేరు మోనా. తను ఎప్పుడూ మౌనంగా ఉండేది. తనకి ఎక్కడికి వెళ్లడం ఇష్టం లేదు ఎప్పుడూ నిర్మానుష్యమైన అడవిలోనే ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటేనే పిల్లలు భయపడి పోతారు కానీ తను మాత్రం భయపడదు చివరికి పెద్దలు కూడా తనను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది ఒక శవాల దిబ్బ ఒక్కోసారి తను ఒంటరిగా,…
Read More