jagadeesh

నా మగువ

నా మగువ అవును నా మగువ ఎదుగుతుంది అవునా నా మగువ జీవిత ప్రయాణంలో మార్పు వస్తుంది..... దేవదాసీలా ఒకరికి దాసిగా ఉండే నా మగువ తన ప్రేమతో ఈ యావత్ ప్రపంచాన్ని తనకు దాసోహం అయ్యేలా మార్చుకుంది అవును నా మగువ బ్రతుకు ప్రయాణంలో మార్పు వచ్చింది చితి మంటలు చేర్చే స్మశానవాటికలో ప్రవేశం లేని నా మగువకు ఇప్పుడు ఒకరికి చితిమంటను పెట్టేదాకా నా మగువా ఎదిగింది అవును నా మగువ మీద ఉన్న అభిప్రాయంలో మార్పు వస్తుంది ఈ సమాజానికి.. పున్నాక నరకం నుంచి కాపాడే వాడు కొడుకు అనే ఆలోచన నుంచి బ్రతుకు ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి కష్టం నుంచి కాపాడేది కూతురు అనే వరకు నా మగువ జీవిత ప్రయాణంలో మార్పు వచ్చింది నాలుగు గోడల మధ్య నలిగే కాలం నుంచి నలుగురికి బ్రతుకు తెరువు చూపేలా నా మగువా ప్రయాణంలో మార్పు వచ్చింది…
Read More

ఓటు హక్కు

ఓటు హక్కు మన అనుకునే ఇక రూపాయి తీసుకుంటే ప్రాణం పోయేదాకా కొట్లాడే మనం మన జీవితాలను శాసించే ఒక వ్యక్తిని ఎంచుకునే ఓటును ఒక బీరు ఒక 500 ల కోసం మనల్ని మనం అమ్ముకుంటున్నాము. "మన బానిసత్వాన్ని దూరం చేయడానికి ఎందరో మహానుభావులు మన కోసం ప్రాణ త్యాగం చేశారు" కానీ మనం ఒక బీరు, ఒక చీర, 500 ల కోసం మన ఓటు అమ్ముకొని ఒక వ్యక్తికి బానిసగా మారుతున్నాము. ఒక్కసారి అమ్ముడుపోయిన మనం మనల్ని కొనుక్కున్న వ్యక్తికి జీవితాంతం ఒక బానిసగా బతకాల్సి వస్తుంది. ఓటు నీ జన్మ హక్కు ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం నీ ఓటు హక్కు - జగదీష్
Read More