jeevitham o vintha naatakam

జీవితం ఓ వింత నాటకం

జీవితం ఓ వింత నాటకం విధి ఆడే ఓ వింత నాటకం జీవితం..! ప్రతీ ఘట్టం విభిన్నం, వైవిధ్య భరితం..! ఒక్కో పాత్ర నేర్పుతుంది ఒక్కో గుణపాఠం..! కల్పితం కాదు ఇది అబద్దాల రణరంగం..! బ్రతికినంత కాలం పరువు కోసం ఆరాటం..! చేజారిపోకుండా కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం..! యమపాశమై ప్రాణాలను కూడా పట్టుకుపోతున్నా, కనిపించని పరువు కోసం పరుగులు పెడుతూ, కనికరం వీడి కదులుతుంది మానవ హృదయం..! ఉందా అసలుందా..? పరువనేది ఉంటుందా..? ఉంటే..! పరువుంటే..! ఎపుడైనా నీకేదురైతే..! అడగాలనుకున్నది అడిగెయ్..! అది అబద్దమైతే కడిగెయ్..! నీ ఆలోచనల్లోంచి..! ఎవరేమంటే నీకేంటి..! ఎవరేమనుకుంటే నీకేంటి..! బ్రతుకు నీది..! భవిత నీది..! కష్టం నీది..! నష్టం నీది..! మరి ఇష్టమెందుకు ఇంకెవరిదో..? ఎవరికోసమో భయపడితే..! ఎవరికోసమో బ్రతికెస్తే..! నువ్వెందుకు..? నీకు మనసెందుకు..? - రమ్య పాలెపు
Read More