కలానికి సలాం
కలానికి సలాం సమాజ అరుణోదయం కోసం పరిశ్రమిస్తూ స్వచ్ఛతకై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తారు త్యాగాలను చిరునవ్వుతో స్వీకరిస్తారు రాత కోసం రాళ్లల్లో..రప్పల్లో పరుగులుతీస్తూ భావి భారత అభ్యుదయ సంక్షేమం కోసం.. సజ్జనుల శ్రేయస్సు కోరి పదప్రయోగం చేస్తారు 'కలం' యోధులై మనందరికోసం పోరాడుతారు కెరటం మాకు ఆదర్శమంటూ..పడినా లేస్తుంటారు మనో సంద్రంలో అలల అలజడులు సృష్టిస్తున్నా.. పెదాలపై చిరు నవ్వుల పూవులు పూయిస్తుంటారు సమస్యల యుద్ధంలో కలం కత్తికి ప్రాణాలర్పిస్తారు అక్షరాలనే తరగని ఆస్తిపాస్తులని దాచుకుంటారు ఇంట ఎన్ని బాధలున్నా పరుల బాధలు తీరుస్తారు ఎండనకా..వాననకా..వాస్తవాల వేటలో సాగుతారు.. అలాంటి కలం కార్మికుల శ్రమైక జీవనానికి సలాం.! - ది పెన్