కసాయిగా మారకు ఓ నేస్తం
కసాయిగా మారకు ఓ నేస్తం ప్రతి జననం ఒక యుద్ధం.. అమ్మలే అందులోని సైన్యం నవమాసాలు కంటికి రెప్పలా కాచుకున్న పసిగుడ్డు.. పొట్టలోనే కాలితో తన్నుతున్నా ఏ జనని నొప్పి అనదు బాధ్యతల భారం ఎంతున్నా బిడ్డ బరువును కాదనదు కడుపున మోసి.. పేగు బందాన్ని ముడివేసి.. తన ఊపిరినే ఆయువుగా పోసి.. బిడ్డకు జన్మనిస్తుంది బతుకు సమరంలో నిత్యం పస్తులుంటున్నా.. తన రక్తాన్నే పాలగా మార్చి కన్నవాళ్ల ఆకలి తీరుస్తుంది పుడుతూనే పొట్ట చీల్చి.. పెరిగి పెద్దయి పాలు తాగిన రొమ్మునే గుద్దే నీచులుగా మారుతున్నారు మృగాళ్లు.. తల్లి ఒడిలో పెరిగింది మరచి పడతి ప్రాణం తీస్తూ.. సృష్టికి మూలమైన స్త్రీ శీలాన్ని దోస్తున్నారీ దుర్మార్గులు కనిపించే ప్రతి ఆడది మన అమ్మకు ప్రతిరూపం నీలాగే మరో మగవాడిని పుట్టించే మాతృస్థానం కసాయిగా మారకు ఓ నేస్తం.. గుర్తించు ఈ సత్యం లోకంలో 'ఆమె' ను మించి కనిపించదు మనకు…