కవల సహోదరులు
కవల సహోదరులు అనగనగా వీరాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. అచ్చట చంద్రయ్య అనే రైతు తన కుటుంబంతో నివసిస్తుండేవాడు. ఆయనుకు ఇద్దరు అబ్బాయిలు. బాగా చదువుకుంటారు. ఇద్దరు కవల సహోదరులు. వారి పేర్లు సదానందం మరియు చిదానందం. పక్క ఊరు నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నారు. దసరా పండుగ సెలవలు వచ్చాయి. పదిహేను రోజులు ఆనందంగా గడపటానికి ఇంటికి వచ్చారు. తల్లితండ్రులు చాల ఆనంద పడ్డారు. ఎందుకు పడరు? కవల పిల్లలంటేనే ఇంటికొక అందం! అమ్మ శాంతమ్మ రకరకాల పిండివంటలు చేసారు పిల్లల కోసం. ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి. పొలం పనిలో చంద్రయ్య ఇంటినుండి బయటకి వెళ్ళటం మొదలు పెట్టారు. వారికి పొలంలో ఒక నుయ్యి ఉన్నది. నీరు కోసం బావి నుండి చోదకయంత్రం (మోటారు) పెట్టి, గొట్టం ద్వారా నీరు తీసి పొలానికి పంపిణి చేస్తారు. వీరాపురం గ్రామం నుండి…