మాటే మంత్రము
మాటే మంత్రము ప్రపంచంలో మాటలతో పరిష్కరించలేని సమస్య అంటూ లేదు. ప్రపంచ యుద్ధాలు కూడా మంచి మాటలతో కూడిన చర్చల వల్ల నివారించవచ్చు. మరికొన్ని సందర్భాలలో దేశాల మధ్య మన్నన లేని మాటల వల్ల యుద్ధాలు సంభవించవచ్చు. మాట తీరు అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దానిని ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని తెలుసుకొని వారి ఆలోచన విధానాన్ని బట్టి మాట్లాడితే పెద్ద సమస్యలకు కూడా గొప్ప పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. ఉదాహరణకు ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ చెబుతాను. ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం కోసం ఊరి చివర ఉన్న బావి వైపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమించడానికి దారిన వెళ్లే వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక సాధువు ఆమెతో ఇలా అన్నాడు.. "అమ్మాయి జీవితం ఎంతో విలువైనది అది…