madi

మది

మది నీ మదిలో చోటిచ్చావు నీ హృదయంలో పదిలపరిచావు నేను నీ దాన్నంటూ మాటలెన్నో చెప్పావు ఎన్నో కథలను కళ్ళ ముందు చూపావు జీవితం నందనవనం అన్నావు మన ప్రేమ అంతం లేనిదంటూ పూల నావలో నడిపించావు కథలెన్నో అల్లావు కదిలి వదిలి వెళ్లావు కాని రానిలోకానికి అదే పూల వానలో కనబడకుండా పోయావు నిశీధిలో నన్ను ఒంటరిగా చేసి నీ దోవన నువ్వెల్లావు నా గురించి ఆలోచించకుండా నా ఆశలు తీరకుండా మన నందనవనం చూడకుండా నీ దోవ నువ్వు చూసుకుంటే ఆ బడబాగ్నిని మోయలేక, మోసే ఓపిక లేక జీవితాన కోరింది రాదని వచ్చింది వెంట ఉండదని అర్థమయ్యే లోపు అంతమయ్యింది జీవితం.... - అర్చన
Read More