meluko oo sthri by mallikarjun gunda

మేలుకో ఓ స్త్రీ

మేలుకో ఓ స్త్రీ అలసిన గొంతుక అరిచిన అలుపెరుగని కేకలు అల్లరి పెడుతూ చుట్టూ ఆకతాయి మూకలు.. అగ్నికణికై ఎదురు తిరిగితె తిరిగి యాసిడ్ దాడులు... అబల అన్న పిలుపుకు తెగుతున్న జీవనాడులు.. అనుక్షణం అడుగడుగున అణిచివేత సంకెళ్లు... పట్టుజారిపోతున్న ఎత్తిన స్త్రీ పిడికిళ్లు. పనిచేయని ప్రభుత్వాలూ పనికిరాని పథకాలూ... ఎందరో నిర్భయలే దీనికి ప్రత్యక్ష సాక్షులు చాలిక ఆగాలిక - ఈ బానిసత్వ బ్రతుకులు, కాలం చెయ్యలిక ఈ కీచక పర్వాలు. ఉవ్వెత్తున ఎగిసిపడు పడిలేచిన కెరటంలా...!? దహించివెయ్ కామాంధుల సనంత అగ్ని కీలలా... అడుగువెయ్ మున్ముందుకు అన్ని రంగాలలో ఎగురవెయ్ నీ పతాక అన్ని లోకాలలో నిప్పురవ్వుకు ప్రతిరూపమా.... ఓ మహిళా లోకమా.. లేదు నీకు అపజయం కలగాలి నీకు విజయం- తప్పదు ఏ నీచుడికే ఈ పుడమిపై పరాజయం.. - మల్లికార్జున్ గుండా
Read More