ముడు ముళ్ళు ఉప్పు కషాయం
ముడు ముళ్ళు ఉప్పు కషాయం పిల్ల బాగానే ఉంది. మాకు నచ్చింది. అన్నయ్య గారు ఇక మిగిలిన వివరాలన్నీ మాట్లాడుకుంటే అయిపోతుంది. అన్నది కళావతి.. అవునవును అంతే అంతే అంటూ చంద్రం గారు వత్తాసు పలికారు. నరేంద్ర, సుగుణ మొహాలు చూసుకున్నారు. అంటే అంతా వియ్యపురాలుదే ఇంట్లో పెత్తనం ఉన్నట్టు ఒక్క మాట తో తేలిపోయింది. అది ఒకందుకు మంచిదే ఒకరి మాట పై ఉంట ఆ ఇంట్లో మంచి ఉంటుంది అని అనుకున్నారు. అదేంటంటే మీరు మౌనంగా ఉన్నారు మా అబ్బాయి మీకు నచ్చలేదా ఏమిటి అన్నాడు చంద్రం గారు. అయ్యో ఎంత మాట నచ్చక పోవడం ఏమిటి అండి భేషుగ్గా నచ్చారు కానివ్వండి మిరెంతలో ఉన్నారో చెప్తే మేము ఆలోచిస్తాం అన్నారు సుగుణ దంపతులు. ఆ ఏముందండి పెద్దగా మేము మతటం ఏమి అధుతాము ఏదో పదిలక్షలు, పది తులాల బంగారం, ఆడపడుచుల లాంఛనాలు ఎలాగూ ఉంటాయి. ఇక…