nee sneham by mallikarjun gunda

నీ స్నేహం

నీ స్నేహం మన ఆట పాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహ బంధం. స్నేహమంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు, మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాని చెప్పటం. కులమత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. గాయపడిన మనసుని సరిచేసేందుకు, స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి, కలవలేక పోయినా నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే. విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది, స్నేహితుడి విలువ. నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ, నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం నీకున్నాం…
Read More