neti samajamlo pelli

నేటి సమాజంలో పెళ్లి

నేటి సమాజంలో పెళ్లి నేటి సమాజంలో పెళ్లి అనేది అంతు లేని తంతు గా తయారయ్యింది. ముందు తరం పెళ్లిళ్ల తో పోల్చుకుంటే నేటిసమాజపు పెళ్లిళ్లు విలువలు, ఆచరణ, అవగాహన భిన్నంగా ఉంటున్నవి . పెళ్లి అంటే ఇద్దరి మనస్సు ల కలయికతో ప్రారంభ మయ్యి కుటుంబ వ్యవస్థ, సామాజిక భద్రత, మరియు సమాజపుభాద్యత వరకు కొనసాగే ప్రక్రియ. అందులో భాగంగానే పెళ్లి అనే అపురూప ఘట్టంలో కుటుంబ సహకారం, ఆత్మీయుల, బంధువుల మధురమైన అనుభూతుల మధ్య, ఆనందాన్ని ఆస్వాదిస్తూ సాగే పెద్ద వేడుక. నేటి సమాజంలో పెళ్లి ప్రాధాన్యత వైవిధ్యంగా జరుగుతున్నాయి. భవిష్యత్తు రూపకల్పన, ఒప్పందాల ప్రకారం ఆర్థిక స్థోమత లు ప్రాతిపదికలు గా నిలుస్తున్నాయి. కానీ పెళ్లి తమదైన శైలిలో విభిన్నంగా , ఆడంబరంగా జరిపిస్తున్నారు కొందరు శక్తికి మించిన స్థాయిలో, గుర్తింపుకోసంపెళ్లివేడుకను, వేదికగా చేస్తున్నారు. సంస్కృతి ఆచారాల కన్నా ప్రచార ఆర్భాటం వ్యాపార దోరణిలో కొనసాగుతున్న విషయం…
Read More