ఊసుల బాసలు
ఊసుల బాసలు దివి నుండి వెలుగు నీవై.. భువి నిండిన అణువు నీవై.. మిన్ను లోను మన్ను లోను.. జోలలు పాడే వాయువు లోను. గతంగా మిగిలిన జ్ఞాపకంలోను సాగిపోయే భవిష్యత్తు లోను. నిన్న నిమిషంలోను రేపటి క్షణంలోను... నిత్యారాధన ఆరాధ్యం నీవై... నీలోని వెతికే నేను గానో నాలో నిండిన నవ్వు గానో నువ్వు గానో.. కలవని కథల మజిలీ అయినా ఆ ప్రేమే కరుణిస్తే మరుజన్మ గానో.. కాలం దీవిస్తే కడసారి అయినా ఎదురు అవుతావేమో అని చిన్న ఆశతో "నీకై ఎదురు చూసే నీ నేను"" చూసిన క్షణం పెదవి దాటని మౌనం మాటాలడే కనులు మనసుతో ఊసుల బాసలు..... - సీతా మహాలక్ష్మి