otami aksharalipi

ఓటమి

ఓటమి చదువుకునే చదువులో ఓటమి, రాసే పరీక్షలో ఓటమి, తల్లికి కూతురిగా ఓటమి, తండ్రికి ముద్దుల పాప గా ఓటమి, తమ్ముడికి మార్గనిర్దేశం చేసే అక్కగా ఓటమి, పెళ్లయ్యాక భార్యగా ఓటమి, భర్తకు స్నేహితురాలిగా, అత్తకు కూతురిగా, మామకు తగ్గ కోడలిగా, మరిది కి హితురాలిగా, ఆడపడుచు అక్కగా, బిడ్డకు తల్లిగా, ఇలా ప్రతి దానిలో ఓటమే నాది, అయినా నాది ఓటమి అని ఒప్పుకోను నేను, ఎందుకంటే..... తప్పు నాది కాదు అంటాను అప్పటి నా మానసిక స్థితిది, అప్పటి నా వయస్సు లేమి, అప్పటి నా పరిస్థితులు అని నేను గట్టిగా చెప్పగలను... నిజం కూడా అదే... - అర్చన
Read More