pagale vennela

పగలే వెన్నెల

పగలే వెన్నెల పరిణతి చెందిన విలువలకే వన్నెతెచ్చే అణువుల అనుభూతుల సరిగమలు వెన్నెల ఉత్సాహాల ఊరట హృదయానికి చెవులుంటే మనసుతెలిపేమధురగీతoచల్లనివెన్నలవుతుంది మదిలోనమమత మెదిలినా కనుల మబ్బుల్లో జడివాన ఆనందాల హాయి కాదా గలగలమనిమాటల లయలు ఒలికినా పరిమళాలవేనీల హారాలు అవే అందినదాన్ని ఆరాధిస్తే విరియును వెన్నెలవలే కలువలై గుభాళించినఅనుభూతులు పంచుకుంటే ముంగిట వాలిన పూజాఫలం కాదా ఈ జగమంతా.....? - జి జయ
Read More

పగలే వెన్నల

పగలే వెన్నల నాఊహలకే కన్నులుంటే చూస్తూ మాట్లాడుతుంటే నామనస్సు కనిపించింది "పగలే వెన్నలని". వెన్నెలో చెలితో ఉంటే ఎంత హాయి అని...... తన వాలుచూపుల తమకంలో ఏం మత్తు ఉందో.... నా గుండెల్లో అలా కదలాడుతుంది.... తన చిరునవ్వుల గలగలలో ఏ పరిమళం దాగుందో..... తొలకరి చినుకల్లే నను నిలువెల్లా తడుపుతుంది.... ఎదో మత్తులో నింపుతుంది.... తన చిలకపలుకులలో ఏం మంత్రం ఉందో..... తన నల్లటి కురులు నామోమును తాకి మత్తెక్కించినట్లని పింస్తూంది.... తన మెడ మలుపులు నను నిలువనీయనన్నవి... తన యదపొంగులు నాకళ్ళార్పనీయలేదు.... తన దరిచేరి చుంబించమన్నవి.... తన జతచేరి నా మది ఆదమరచి ఆమె వడిలో నిదుర పోతానంటుంది.... ఆమ సొగసైన హొయలు, వంపు సొంపులు.... వరాల వెండిపూల వానలో నను అభిషేకిస్తుంటే తన కాటుక కనుల వాకిలిలో ముగ్గులేసుకొనే నా ఊహలు.... అందమైన సుందర తీరాలలో నన్ను తిప్పుతుంటే.... ఇంకా ఏం వెతుకుతుందో నా మనసు తనతో…
Read More