ప్రేమ
ప్రేమ నా హృదయంతరాలలో నీ పేరు చెక్కుకున్న నేను నీ మదిలో చోటు కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపుల లో బ్రతికే నేను నీకు ఎదురవ్వాలని పరితపిస్తున్నా నా కళ్లలో నిన్ను నింపుకున్న నేను నీ నవ్వు లో నేను ప్రతి క్షణం ఉండాలని కోరుకుంటున్నా నీ ప్రేమ దాసుడిగా మారాలని తపించి పోతున్నా నీ హృదయం లో చోటు కోసం ఎదురు చూస్తున్నా నీ జీవితం లో సగమవ్వాలని వేచి ఉన్నా నా ఈ చిన్ని కోరికను మన్నిస్తావా ప్రియతమా ... - సిద్దూ పవన్