నేనూ నా కాశీ యాత్ర
నేనూ నా కాశీ యాత్ర 2019 అక్టోబర్ నెల నా పుట్టిన రోజున మావారు ఒక కొత్త ప్రతిపాదన తెచ్చారు. అదేంటంటే కాశీకి వెళ్దాం అని ఆయన అలా అనగానే నాకు వింత గానూ, కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా వయసు అయ్యాక కాశీ ని చూడాలని, అక్కడ మోక్షం పొందాలని అనుకుంటారు. ఈయనేంటి ఇలా అంటున్నారు అనే ఆశ్చర్యం తో పాటూ, ఎప్పుడూ పూజలు అంటూ విరామం లేకుండా తిరిగే ఇయన గుడి, పూజలు వదిలేసి వెళ్ళాలనుకోవడం వింతగా అనిపించింది. మా వారి తో, ఇప్పుడేం కాశి యాత్ర అండి, దానికి ఇంకా చాలా సమయం ఉంది. మెల్లిగా వెళ్లొచ్చు, అసలే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి.. ఇప్పుడు ఈ చలికాలంలో అంతదూరం వెళ్లడం అవసరమా అంటూ ఆయన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేశాను. ఎందుకంటే అప్పటికే మేము గానుగాపూర్, శ్రీశైలం, తిరుపతి, మంత్రాలయం, వంటి యాత్రలకు ఎన్నో సార్లు వెళ్లివచ్చాం.…