ప్రేమంటే ఇదే
ప్రేమంటే ఇదే ఏదో... ఆలోచనల్లో వున్న శరత్ గారు.. వాళ్ళావిడ వీల్ చైర్ నుండి వచ్చిన బెల్ శబ్దం తో ఉలిక్కిపడి వెంటనే పడక గది నుండి వరండాలోకి పరుగు లాంటి నడక తో వచ్చారు.. ఆవిడ ఆకలి వేస్తోంది అంది.. వెంటనే ఫ్రిజ్ లో వున్న పిండి తీసి అట్లు వేసి ఇచ్చారు.. 30 సం.. క్రితం వెన్నుపూస విరిగిపోవడం వల్ల అప్పటి నుండి ఆమె ఆ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.. ఆవిడ పడుకుంటాను అంటే వెంటనే మంచం మీదకి జాగ్రత్తగా పడుకోబెట్టి.. ఆమె నిద్ర పోయె వరకూ అక్కడే వుండి ఆయన ఆమెనే చూస్తూ... గతం అంతా గుర్తు చేసుకున్నారు.. శరత్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి రిటైర్డ్ govt ఉద్యోగి.. అనుకోకుండా తల్లి అనారోగ్యంతో మరణించింది.. శరత్ తండ్రి నీవు పెళ్లి చేసుకో.. ఇంటికో ఆడ దిక్కు వుంటుంది…