rambabu writing

మాటల మంటలు

మాటల మంటలు మౌనాలు మలుపులు  మనసుకు తాళాలు చిక్కుముడులు పీటముడులు  బంధాలు అనుబంధాలు  ఆట ముగుస్తుందని  కన్నార్పలేము  కనుల నీటిచెమ్మ ఆశకు నీటి చెలమ  కలతలు కష్టాలు  యుగళగీతాలు పలకరింపుల వానే ఎడారికోయిల  ఎదమీటే రాగాలు  ఎదపంచే మోహాలు ఎడబాటు ఆవేశాలు  మనసుకు ఆదేశాలు కలలను మోసేవాడు కలతలు తీర్చుతాడు  కాలం చెట్టుకు  పాదులు తీయగలిగేవాడెవ్వడు - సి.యస్.రాంబాబు
Read More

తీరం

తీరం శిశిరమైతేనేమి ఆకురాలినచోటే పూలు తలూపుతుంటాయి విప్పుకునే జ్ఞాపకాల వెనకే తప్పుకునే వ్యాపకాలుంటాయి తలపులను తడుముతుంటే మనసు తలుపులు తెరచి స్వాగతగీతాన్ని పాడుతుంది గతుకుల గతాన్ని పూడ్చమంటుంది పరుగులు తీసే కాలం కరవాలం కనుగొనాలని తాపత్రయపడతాం వేటుపడక మానదుకదా కాలంతో వేరుపడే ఆలోచనెందుకు మట్టిపరిమళం చుట్టేయాలంటే మట్టితో మమేకమవ్వాలిగా మమతలన్ని పెనవేస్తేనే మనుషులంతా అర్థమయ్యేది సుఖదుఖాలు రాగద్వేషాల వలయంలో శ్రుతిలయలు స్థిరంగా తిష్ఠవేసుకుంటే చీకట్లనుమోసే జీవితం తీరమెన్నడు చేరెనో ! - సి.యస్.రాంబాబు
Read More