ramya

జీవితం ఓ వింత నాటకం

జీవితం ఓ వింత నాటకం విధి ఆడే ఓ వింత నాటకం జీవితం..! ప్రతీ ఘట్టం విభిన్నం, వైవిధ్య భరితం..! ఒక్కో పాత్ర నేర్పుతుంది ఒక్కో గుణపాఠం..! కల్పితం కాదు ఇది అబద్దాల రణరంగం..! బ్రతికినంత కాలం పరువు కోసం ఆరాటం..! చేజారిపోకుండా కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం..! యమపాశమై ప్రాణాలను కూడా పట్టుకుపోతున్నా, కనిపించని పరువు కోసం పరుగులు పెడుతూ, కనికరం వీడి కదులుతుంది మానవ హృదయం..! ఉందా అసలుందా..? పరువనేది ఉంటుందా..? ఉంటే..! పరువుంటే..! ఎపుడైనా నీకేదురైతే..! అడగాలనుకున్నది అడిగెయ్..! అది అబద్దమైతే కడిగెయ్..! నీ ఆలోచనల్లోంచి..! ఎవరేమంటే నీకేంటి..! ఎవరేమనుకుంటే నీకేంటి..! బ్రతుకు నీది..! భవిత నీది..! కష్టం నీది..! నష్టం నీది..! మరి ఇష్టమెందుకు ఇంకెవరిదో..? ఎవరికోసమో భయపడితే..! ఎవరికోసమో బ్రతికెస్తే..! నువ్వెందుకు..? నీకు మనసెందుకు..? - రమ్య పాలెపు
Read More

అబ్బాయిల జీవితం

అబ్బాయిల జీవితం పితృస్వామ్య వ్యవస్థ ద్వారా మగవాళ్ళు ఆడవాళ్ళని అనాది కాలం నుండి అన్ని విధాలా అధఃపాతాలానికి అణగద్రొక్కుతూనే ఉన్నారు ఈరోజుకి కూడా. చదువు ప్రసాదించిన తెగువతో ప్రపంచాన్ని అర్థంచేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు మహిళామణులు. ఇది ఇలా సాగుతున్న తరుణంలో కొంతమంది స్త్రీలు స్త్రీ వాదాన్ని తమ స్వంత ప్రయోజనాల కోసం చెడు మార్గంలో ఉపయోగించుకుని ఆడజాతి అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్న ఎందరో మహనీయుల పోరాటాలకు అర్థం లేకుండా చేస్తున్నారు. మరి ఇది మగవారి దురదృష్టమో లేక ఆడజాతికి పితృస్వామ్య వ్యవస్థ ద్వారా వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన ప్రతిఫలమో తెలీదు కానీ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతూ ఉండడం మాత్రం బాధాకరం. పూర్వపు రోజుల్లో ఎత్తిన తల దించకుండా, అమ్మ, నాన్న మాట జవదాటకుండా పెంపకాలు ఉండేవి. నిజానికి లోకం తెలీకుండా సమాజమనే భయం చూపించి పెంచేవారు. టెక్నాలజీ వృద్ధికి నోచుకోకపోవడం ఒక…
Read More

అసమానత

అసమానత ఏది నిజం..! ఏది నిజం..! 74 ఏళ్ళ గణతంత్రమా..? ఆనాదిగా ఉన్న మగతంత్రమా..? ఈనాటికీ ఆడవాళ్ళ ఆత్మాభిమానాన్ని వంటగదిలో బంధించడమేనా..? స్వతంత్ర, గణతంత్ర భారతం సాధించిన ఘనత..! ఆడ వాళ్ళకి చదువెందుకూ..! ఎదురు మాట్లాడే తెగువెందుకూ..! అనడం మానుకోని నీచపు సమాజమా..? అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించిన భవిత..! అమరవీరుల త్యాగం..! చిత్రపటాలకే పరిమితం..! అంబేద్కర్ కలలు కన్న దేశం..! శిశువు దశలోనే కోల్పోయింది ప్రాణం..! లేదు నిజం..! లేనే లేదు నిజం..! సమానత్వం ఒక బూటకం..! కేవలం సమాజం ఆడుతున్న నాటకం..! నిజంగా నిజం..! ఇదే నిజం..! ఇదే నిజం..! - రమ్య
Read More