సిరులమేను.. పైడితల్లి సిరిమాను
సిరులమేను.. పైడితల్లి సిరిమాను ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. అమ్మలగన్న అమ్మ పైడితల్లి అమ్మవారి పేరిట ప్రతి ఏటా జరుపుకునే అమ్మవారి సిరిమానోత్సవం దేశంలోనే ఎక్కడా జరగని కనీవినీ ఎరుగని సంబరం. ఈ జాతర విశేషాలను స్మరించుకున్న ప్రతిసారి భక్తితో తనువు పులకిస్తుంది. అమ్మకు అచేతనంగానే మనసు నమస్కరిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నెలరోజుల ఈ జాతరలో ఈనెల 11న సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది... విజయనగరం రైల్వేస్టేషన్‌కి సమీపంలో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. వనం అంటే అడవి కనుక దీన్ని వనంగుడి అన్నారు. దీన్ని అమ్మపుట్టినిల్లుగా భావిస్తారు. ఊరి మధ్యలో చదురుగుడి ఉంది. దీన్ని మెట్టినింటిగా కొలుస్తారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలుంటాయి. దీనిలోని నీటిని అమ్మవారి తీర్థంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దీని మొదట్లో పోతురాజు పూజలందుకుంటూ ఉంటాడు. ఉత్తరాంధ్ర కల్పవల్లి: విజయనగరంలో అమ్మవారు వెలిసిన…