తల్లి మనసు.!
తల్లి మనసు.! అప్పుడు సమయం రాత్రి 11.35 నిమిషాలు.. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.. ఆఫీస్ పనిలో పడి ఎప్పట్లాగే తినడం మర్చిపోయాడు సంతోష్.. వర్షం కాస్త తగ్గడంతో బైక్ తీసుకుని బయటకు వచ్చాడు.. అప్పుడు ఆకలి గుర్తురావడంతో బయట ఏదైనా దొరుకుతుందేమో చూద్దామని బయలుదేరాడు. వీధి చివరకు వచ్చే సరికి ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు సంతోష్.. ఓ పెద్దావిడ.. అప్పటికే వర్షంలో బాగా తడిసిపోయింది.. బాబూ అంటూ తన వద్దకు రమ్మని పిలుస్తోంది.. కాసేపు సంతోష్ కి ఏమీ అర్ధం కాలేదు.. అయినా, బైక్ యూ టర్న్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆ అమ్మ చాలా ఆందోళనగా కనిపిస్తోంది.. ఎందుకో కంగారు పడుతోంది. "ఎవరమ్మా మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడున్నారేంటి?" అని అడిగాడు సంతోష్.." మా బాబు సినిమాకు వెళ్ళాడయ్యా, ఫోన్ చేస్తున్నా తీయడం లేదు.. ఈ వర్షంలో…