thriller story

ఎవరు పార్ట్ 1

ఎవరు పార్ట్ 1 అరగరాగా అలీ అనే ఒక అతను అప్పుడే కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ ముందు బయట టాయిలెట్ పోసుకుంటూ, ఎవరైనా గమనిస్తున్నారా అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలో ఒక గెడ్డం వాడు ఒక బ్యాగ్ వేసుకుని, మనిషి లాగే రెండు చక్రాల రిక్షా దిగి అతని బ్యాగ్ కూడా అలీ బ్యాగ్ పక్కన పెడతాడు. అతని మొహం కన్నా జుట్టు ఎక్కువ ఉండటం వల్ల, అతను చూడటానికి వింతగా కనిపించాడు అలీకి. ఆ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి అతను బ్యాగ్ తీస్కుని స్టేషన్ వైపు పరిగెడతాడు. అతను ఎందుకు ఆలా పరిగెడుతున్నాడో అర్థం కాక అలీ జిప్ పెట్టుకుంటూ తన బ్యాగ్ తీసుకుంటాడు. ఆ బ్యాగ్ అతనిది కాదు అని చూసుకుని అలీ ఆ గెడ్డం వాడి వెనకాల పరిగెడతాడు. అలీ: “ఏయ్.... ఏయ్... అది నా బ్యాగ్”. గెడ్డం అతను ఇంకా…
Read More

కిల్లర్

కిల్లర్ రెండు వారాల ముందు... "మీకెందుకు ఇబ్బంది హోటల్లో రూమ్ తీసుకుంటాను కిరణ్ గారు" అని మాటవరసకి అన్నాడు వరుణ్. "బలే వారే! నాకేం ఇబ్బంది లేదు సార్... మీరు రండి..." అంటూ బైక్ స్టార్ట్ చేసాడు కిరణ్. బస్ స్టాండ్ నుండి హైవే వైపు బండి స్పీడ్ గా వెళ్ళింది. నాలుగు గంటల జర్నీ అంత పరిచయంతోనే వరుణ్ ని ఇంటికి పిలుస్తాడు కిరణ్. ఊరి చివరికి చేరుకుంటారు. హైవేకి దగ్గరలో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లోకి వెళ్తుంది బైక్.  "చాలా ప్రశాంతమైన ప్లేస్ కదా సార్ చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ చూస్తూ" అంటాడు వరుణ్. చిన్నగా నవ్వి, "అవును సార్ నైట్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ సౌండ్ కాస్త ఇబ్బంది" అంటాడు కిరణ్ బైక్ పార్క్ చేస్తూ.... ఇద్దరు లిఫ్ట్ లో వుంటారు. వరుణ్ ఎదురుగా ఉన్న లిఫ్ట్ యొక్క గ్రిల్స్ డోర్ ద్వారా దాటుతున్న ఒక్కో ఫ్లోర్ ని…
Read More