uma mahshwari

గుబాళించే పరిమళం

గుబాళించే పరిమళం వేడెక్కిన ధాత్రికి ఉపశమనాన్నిస్తూ ఉరకలెత్తే సంద్రం అలలను వేడెక్కిన సూరీడు ఆవిరుల దూదిపింజెలను చేసుకుని చల్లని మలయమారుతం అలా తాకగానే సుతారంగా ప్రియుని చేతి స్పర్శ తాకగానే తనువంతా పులకించిన ఆ ప్రేయసి మురిపెంలా చిరు చిరు జల్లులు చిలకరిస్తూండగా... తడుస్తున్న ఆ పుడమి నుండి వచ్చేటి పరిమళం ఎంత పీల్చినా తనివితీరని ఆ మధురానుభవం మాటలకందని మధురానుభూతిని సొంతం చేస్తుంటే తెలుగుభాషలోని అక్షరాలను ఏరుకుని తెస్తున్నా.. పదాలన్నిటినీ ప్రోదిచేసి ఆ భావాలకి అక్షర రూపమీయాలని... అలుపెరుగని మనసుతో ఎల్లకాలం ఆ పరిమళాలను సొంతంచేసుకుంటూ కలకాలం నాతోనే దాచేసుకోవాలని... చిత్రమేమిటో తెలీదుకానీ ఎన్ని వాణిజ్య సంస్థలు వచ్చినా ఎన్నెన్ని రకాల పరిమళాలను గుభాళింపచేస్తున్నా ఆ ప్రకృతమ్మ పులకరింపులో దాగిన గమ్మత్తైన ఆ పరిమళాన్ని అందిపుచ్చుకున్న ఘనుడేడనీ.. నాటికీ...నేటికీ...ఏనాటికీ...అది మన తరం కాదని కాలాలు మారినా...జగమంతా మారినా.. మట్టివాసనకు మించి‌న పరిమళమేదని గుభాళింపులో దాగిన ఆ గమ్మత్తు ఏదని దానికదే…
Read More