ఉపవాస దీక్ష
ఉపవాస దీక్ష ఉపవాస దీక్ష అంటే ఉప అంటే సగం దీక్ష అంటే దీక్షగా చేసేది. అంటే మనం చేసే ఉపవాస దీక్షను దీక్షగా సంకల్పం చెప్పుకుని చేయాలి. సంకల్పం అంటే మనం ఏ దేవతకు చేస్తున్నామో వారికి తల్లి నా కోరిక ఇది అందుకు నేను ఈ దీక్షను చేస్తున్నాను. నా కోరిక నెరవేర్చు అంటూ చేయాలి. ఇక ఇలా దీక్ష చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల ఉన్న మలినం అంతా చెమట రూపంలో పోయి శరీరం, ఆత్మ శుద్ది అవుతుంది. ఇది మామూలు భక్తులకు ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వారికి. మరి పేదల మాటేమిటి? రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో సగం రోజు లేదా ఒక రోజు అంత కూడా అసలేమీ తినకుండా పస్తులు ఉంటున్న ఆ పేదల కోరికలను భగవంతుడు తీరుస్తాడా? తిర్చడా? తీరిస్తే మరి వారింకా పేదలుగా ఎందుకు ఉన్నారు? ఒక్క పూట…