vennela sree

ప్రేమ లేఖ

ప్రేమ లేఖ హలో మై హ్యాండ్సమ్, ఓయ్ నిన్నే ఏంటి బాబు హాయిగా బజ్జున్నవా, ఇక్కడేమో నాకు నిద్ర రాకుండా చేసి, వెంటనే నేను ఎం చేశాను అంటావేమో... నీకేం తెల్సు నువ్వు ఎంత అల్లరి పిల్లోడివో, రోజు నా కల్లోకి పదే పదే వచ్చి నా మనసు తలుపులను తట్టుతుంటే ఎలా బాబు పడుకొనేది... అందమైన ని రూపం నా మదిలో మెదులుతూ మరి అల్లరి పెడుతోంది. నువు నన్ను చూసినప్పుడు నీ పెదవులపై పూసే చిరునవ్వు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎంత అందంగా నవ్వుతావో తెలుసా, ఆ నవ్వు కి ఏ అమ్మాయి పడిపోదు చెప్పు.. అందుకే నేను కూడా నీతో ప్రేమలో పడిపోయానేమో  ఇంటి ముందు ముగ్గు వేయడానికి వచ్చినప్పుడు ఎదురుగా నువ్వు కనబడతావేమోనని ఎంతగా ఎదురు  చూసేదాన్నో... చివరికి నువ్వు కనబడగానే ప్రపంచాన్నే జయించినంత సంతోషం, ఎవరెస్టు శిఖరం అధిరోహించినంత ఆనందం. మానస సరోవరం…
Read More