వేయి పడగలు పుస్తకం రివ్యూ
వేయి పడగలు పుస్తకం రివ్యూ వేయిపడగలు నవల గురించి రివ్యూ రాయడమంటే సాహసమే అని చెప్పాలి. దీనికి రివ్యూ రాయడమంటే ఒక చిన్నపాటి పుస్తకం రాయడం వంటిది. దీనిని చాలామంది ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక ఇతిహాసం అని పిలుస్తారు. చదివిన తర్వాత ఆ విధంగా పిలవడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. విశ్వనాథసత్యనారాయణ గారు స్పృశించని అంశం లేదు ఇందులో. జేబుదొంగ మనోగతం నుంచి రాజు గారి (కృష్ణమనాయుడు) ఔదార్యం నుంచి, పరమేశ్వర శాస్త్రి స్నేహం దగ్గర నుంచి ఒక్కటేమిటి సమాజంలో కనిపించే అన్నిరకాల మనస్తత్వాలు ఇందులో కనిపిస్తాయి. ఒక నవలగా చదవడం ప్రారంభించి మనముందే జరుగుతుంది అన్నట్టుగా,దానికి మనము సాక్ష్యులుగా నిలుస్తున్నాం అన్న భావన చదివే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇందులో ప్రధానమైన సుబ్బన్నపేట అనే గ్రామం కావచ్చు మరియు అందులో ఆయన లిఖించిన పాత్రల తీరు కావచ్చు, వాళ్ళంతా మన ముందు తిరగాడుతున్నట్లు ప్రత్యక్ష ప్రసారం చేసారనడంలో ఎటువంటి అతిశయోక్తి…