రెడ్ లైట్ ఏరియా
రెడ్ లైట్ ఏరియా ఆదరా బాధరగా పరెత్తుతూ వచ్చింది లలిత రైల్వే స్టేషన్ కి, స్టేషన్ కి రాగానే, గట్టిగా నిట్టూర్చి, చుట్టూ చూసి, తనని ఎవరు గమనించడం లేదని అనుకుని, బరువుగా ఉన్న బ్యాగ్ ని ఒక దగ్గర పెట్టి, దాని పక్కనే కూర్చింది. ప్రవీణ్ కోసం ఎదురు చూస్తూ.... అబ్బా ఇంకా రాడేంటి అసలు ట్రైన్ వచ్చే సమయం కూడా అయ్యింది. అని అనుకొని చుట్టూ చూసింది ఇంతలో ప్రవీన్ వస్తూ కనిపించాడు. అతని చేతిలో ఒక చిన్న బ్యాగ్ మాత్రమే ఉంది. అది చూసి లలిత ఆశ్చర్యపోయింది. హమ్మయ్య ఎలాగూ వచ్చాడు అని అనుకొని, ఏంటి ప్రవీణ్ ఇది, నన్ను ఇంత త్వరగా రమ్మని, నువ్వు లేట్ చేసావ్ ఏంటి? అని గారాబంగా అడిగింది. ఏం లేదు బంగారం మా ఇంట్లో వాళ్ళని నిద్ర పుచ్చి వచ్చేసరికి ఇలా అయింది, అని బుజ్జగించాడు లలితని. హా నీకే…