ఏ రాయైతేనేం.!
ఏ రాయైతేనేం.! మా తాతకి ఒక నమ్మకం ఉండేది.. నేను మందులు తీసుకెళ్లి ఇవ్వగానే.. ఎంతరా.. అనే వాడు.. ఖరీదు చెప్పగానే.. ఆ మందు పనిచేస్తుందా.. లేదా అనేది తేల్చేసేవాడు.. నేనప్పుడు ఆశ్చర్యంగా చూసేవాడిని.. ఈయనేదో పెద్ద డాక్టర్ అయినట్టు.. అన్నీ తెలిసినట్టు చెప్పేస్తాడేంటో.. నన్ను ఆడుకోనివ్వకుండా.. అని తిట్టుకున్న సందర్బాలు కూడా చాలానే ఉన్నాయి.. డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మా నుంచి దూరమై ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలతో ఏడిపిస్తూనే ఉంటారు. కొద్దిరోజుల క్రితమే మా సోదరి ఆడపడుచుకి అనారోగ్యం అంటే.. రిపోర్టులు తెప్పించుకుని తెలిసిన వైద్యులకు చూపించాను.. నాలుగు పదుల వయసు దాటిన ఆమెకు వచ్చింది ప్రాణాంతక వ్యాధిలా ఉందని సందేహపడి వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురమ్మారు.. అక్కడైతే ఆధునిక సామాగ్రి ఉందని, వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారని.. మనం మాట్లాడి మరింత మెరుగైన వైద్యం అందించేలా చూడవచ్చని వారు చెప్పింది యథాతథంగా మా బావకు, ఆయన…