yodha episode 3 aksharalipi

యోధ ఎపిసోడ్ 3

యోధ ఎపిసోడ్ 3 అలా ఢీ కొట్టిన వాళ్ల కార్ దగ్గరకు వచ్చి, ఎవరో ఆ కార్ డోర్ ని కొడుతూ అందులో వున్న వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తున్నారు. "సారు...! సారూ...!" అంటూ ఒక మగ వాయిస్ "అయ్యా...! అమ్మా..!" అంటూ మరొక ఆడ వాయిస్ తో పార్ధు మరియు అతని స్నేహితులకు బయట నుండి వాళ్ళని ఎవరో పిలుస్తున్నట్టు వాళ్ళకి ఒకటే శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ పిలుపులు దాటికి ఉల్లిక్కి పడి లేచి, డోర్ తీసిన వాళ్ళకి అసలు వాళ్ళు ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో? కూడా అర్థం కావడం లేదు. కానీ, చుట్టూ చూస్తుంటే అప్పటికే ఉదయం అయినట్టు వాళ్ళకి అర్థమైంది. కార్ పక్కనే ఒక మగ మనిషి, ఆడ మనిషి వాళ్ళకి దర్శనం ఇచ్చారు. కార్ లో నుండి కిందికి దిగిన వాళ్లకు, పక్కనే ఒక పెద్ద బంగ్లా కూడా దర్శనమిచ్చింది. ఆ బంగ్లా గోడకే వీళ్ళ కార్ డాష్ ఇచ్చినట్టు వాళ్ళు గమనించారు. అలా…
Read More