యోధ ఎపిసోడ్ 6
యోధ ఎపిసోడ్ 6 రాత్రి ఏడు గంటలవుతున్నా... ప్రియను తన గదికి తీసుకెళ్లిన గౌతమి, కృతి ఇద్దరూ ప్రియ కోలుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బలమైన షాక్ తిన్న ప్రియ మాత్రం దాని నుండి కోలుకోలేకపోయింది. అప్పటికే ఆ ముఖ ద్వారం తెరవడానికి, మరియు ఆ అజ్ఞాత స్వరం కలిగిన వ్యక్తిని పట్టుకోవడంలో విఫలయత్నం చెంది విసిగిపోయిన పార్ధు, గోపాల్, విశాల్ ఓపిక నశించి... వాళ్లు కూడా చేసేదేమీ లేక ప్రియ గదికి వచ్చారు. ఒక పక్క ప్రియ స్పృహలో లేకపోవడం... మరొక పక్క అవేశ్ ఆచూకీ లభించకపోవడం (దాదాపు తను చనిపోయినట్టు భావిస్తున్నారు అంతా), దానికి తోడు అక్కడ జరుగుతున్న అనూహ్య పరిణామాలు... వాళ్ళందరి మొహాల్లో విచారాన్ని తెలుపకనే తెలుపుతున్నాయి. గౌతమికి దుఃఖం పొంగుకొస్తుంది. తన దుఖం ఆపుకోలేక ఏడుస్తుంది. తనతో పాటు అప్పటివరకూ ఎంతో కొంత దైర్యంగానున్న కృతి కూడా గౌతమికి జతవుతుంది. వాళ్ళని ఓదార్చే పనిలో ఉంటారు గోపాల్ మరియు…