vennela poojitha

యువతులు ఎగిరే గాలిపటాలు,,,,,,,!!

యువతులు ఎగిరే గాలిపటాలు,,,,,,,!!

యవ్వన ప్రాంగణంలో ఉన్న యువతులు
కలల పూతోటలో విహరిస్తూ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు
యువతులు తమకున్న ప్రతిభ జ్ఞానాన్ని తమకున్న కుటుంబ సమస్యల రీత్యా స్వేచ్ఛను కోల్పోయి అమలుకు నోచుకోక తమలో తామే ఎవరికి తెలియకుండా కుమిలిపోతారు,,,,,,,,
ప్రతి విషయానికి తెచ్చిపెట్టుకున్న నవ్వు నటనలతో జీవన మాధుర్యాన్ని కోల్పోతారు,,,,,,,
ఒకవేళ పెళ్ళైన యువుతులైతే తమ భాగస్వాములతో తెచ్చిపెట్టుకున్న హావభావాలు ప్రదర్శిస్తూ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు,,,,,,,,,
ఉద్యోగులైన యువుతులైతే జీవనం కంటకభూయిష్టమే కాన్పులనీ పిల్లల పెంపకం వాళ్ళ చదువులు బాధరాబందీ అంతా తమ భుజస్కంధాలపై నుండి కదలిపోవడమే,,,,,,,,,
భర్త అనేవాడు ఎలావున్నా ఏంచేసినా భార్య అనే మహిళ సర్దుకుపోతూ కుటుంబం బాగోగులు చూసుకునే అజ్ఞాత యజమాని,,,,,,,
తప్పంటూ జరిగితే సమాజానికి మొదట మహిళే కళ్ళ ముందు అగుపడే ముద్దాయి,,,,,,
మగాడు పనికిమాలిన వెధవైనా మహిళను తన చెప్పుచేతుల్లో ఉంచుకుని వినకపోతే చిత్రహింసలు పెట్టె పిచ్చివేదవ,,,,,,
మహిళకు గర్భధారణ అనేది ఉండడం వల్ల ఆమె మగతోడు సంకెళ్ళ మధ్య బిగుసుకుపోయింది,,,,,,,,,
మహిళలు ఖాళీ సమయంలో సామాజిక సేవలో పాలుపంచుకుంటే హృదయం గాంభీరమై నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు,,,,,,,

– అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *